కాంగ్రెస్ నేతను బిజినెస్ మెన్ ను చేసిన మోదీ

nanrendra modi cabinet ministers

పకోడీలు అమ్మకోవడం కూడా ఉద్యోగమే అన్న ప్రధాని నరేంద్ర మోడీ మాటలు ఓ కాంగ్రెస్ నేతను బిజినెస్ మెన్ ను చేశాయి. ప్రధాని మాటలను సీరియస్ గా తీసుకుని పకోడీల బండిని మొదలుపెట్టిన ఆ నేత అనతికాలంలోనే 35 శాఖలు ప్రారంభించారు. వివారాల్లోకెళితే… గుజరాత్ వడోదరకు చెందిన నారాయణ భాయ్ అనే వ్యక్తి పీజీ చేసిన నిరుద్యోగి. కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని, ఆ పార్టీ విద్యార్థి సంఘం ఎన్.ఎస్.యూ.ఐలో నాయకుడు. ఓ రోజు టీవీలో మోడీ ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలోనే మోదీ పకోడీలపై వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించినా, నారాయణభాయ్ మాత్రం పాజిటీవ్ గా తీసుకున్నారు. వడోదరలో మంచి అడ్డా చేసుకుని పకోడీల వ్యాపారం మొదలుపెట్టారు. అయితే ఆయనకు ఈ వ్యాపారం బాగానే కలిసివచ్చింది. కొన్నిరోజుల్లోనే 35 స్టాళ్లతో నగరమంతా వ్యాపారాన్ని విస్తరించారు. దీంతో ఆయన ప్రతీరోజూ 500-600 కేజీల పకోడీలు అమ్ముతూ చిన్న వ్యాపారంలో పెద్దసైజు వ్యాపారవేత్తగా ఎదిగారు.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*