రూ.పది కోట్లు ఫట్ మన్నాయే….!

సిటీలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. మల్టీ లేవల్ మార్కెటింగ్ పేరుతో అడ్డంగా దొచుకుంటున్నారు. ఇంటర్ నెట్ లో వివిధ నకిలీ పేర్లతో సైట్లను క్రియేట్ చేసి అమాయకులను బుట్టలో పడేస్తున్నారు. లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే… రెండు లక్షలు సంపాదించొచ్చని నమ్మిస్తారు. తాజాగా మల్టీ లేవల్ మార్కెటింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఘారానా ముఠా అరెస్ట్ చేశారు నార్త్ జోన్ టాస్క్ పోర్స్ పోలీసులు. గత కొంత కాలంగా ఈ ముఠా సభ్యులు… కాయినెక్స్ ట్రేడింగ్ పేరుతో 10 కోట్ల వరకు మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

డిజిటల్ మార్కెటింగ్…..

పరుగులు తీస్తున్న ప్రపంచ టెక్నాలజీని మన అర చేతిలో చిన్న స్మార్ట్ ఫోన్ లో చూస్తున్నాము. చిన్న పిల్లాడి నుండి ముసలి వాళ్ళ వరుకు ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి సమాచారం కోసం సెర్చ్ ఇంజిన్ ని ఉపయోగిస్తున్నాం. ఇలా ఇంటర్నెట్ ని వాడే తరుణం లో బయట చేసే మార్కెటింగ్ ని ఇంటర్నెట్ ద్వారా చేస్తే అదే డిజిటల్ మార్కెటింగ్. ఆన్ లైన్ లో ప్రొడక్ట్స్ మార్కెటింగ్ చేసేవాళ్ళకి , తమ కంపెనీల బ్రాండ్స్ ని ప్రమోట్ చేసుకోవాలనుకునే వాళ్లకి ఈ డిజిటల్ మార్కెటింగ్ చాలా ఉపయోగపడుతుంది. ఇది ట్రేడిషనల్ మార్కెటింగ్ కి పూర్తి విభిన్నం. ఇంతకు ముందు టీవీ , రేడియోలలో యాడ్స్ ఇచ్చేవారు. ఇవి చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి. కానీ ఇప్పుడు ఫేస్ బుక్, యూట్యూబ్, సోషల్ మీడియాల ద్వారా యాడ్స్ ఇస్తున్నారు. అంతేకాకుండా మనం ఎవరినైతే టార్గెట్ చేయాలనుకుంటున్నామో వాళ్లకి మాత్రమే మన సమాచారం చేరేలా సహాయపడుతుంది.

తక్కువ సమయంలో…..

తక్కువ టైములో ఎక్కువ మంది కస్టమర్స్ ని రీచ్ అయ్యేలా చేసేదే డిజిటల్ మార్కెటింగ్.అసలుకు రెట్టింపు ఇస్తాం… ఎక్కడా లేని అధిక వడ్డీ చెల్లిస్తాం.. ఇదే మంచి అవకాశం.. సద్వినియోగం చేసుకోండి.. ఇలా ఆకర్షణీయమైన ప్రకటనలతో బురిడీ కొట్టించే సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా ఈ సంస్థలు చట్టాల్లోని లొసుగులనే ఆధారం చేసుకొని తప్పించుకుంటున్నాయి. దేశీయ సంస్థలకు తోడు విదేశీ సంస్థలు కూడా ఎంతో సులువుగా దేశీయ మార్కెట్ లోకి చొరబడుతున్నాయి. మాయ మాటలు చెప్పి సులువుగా డబ్బుసంపాదించవచ్చని ముఖ్యంగా మధ్యతరగతి జీవులను ఈ సంస్థలు టార్గెట్ చేసుకొని నిలువునా ముంచేస్తున్నాయి.

భలే ఎరవేశారు…..

వివిధ ప్రాంతాలకు చెందిన రమేష్, సత్తయ్య, వెంకటేష్, హరిగొపి, శ్రీనివాస్ లు ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఈజీగా డబ్బులు సంపాదించేందుకు స్కెచ్ వేశారు. ఇంకేముంది,,,, హైదరాబాద్ లోని బోయిన్ పల్లిలో కాయినెక్స్ ట్రేడింగ్ అనే పేరుతో ఓ నకిలీ సంస్థను ఏర్పాటు చేశారు. కాయినెక్స్ ట్రేడింగ్ కి అన్ని అనుమతులు ఉన్నాయని జనాలను నమ్మించారు. ఆన్ లైన్ లో ట్రేడింగ్ గురించి ప్రచారం చేశారు. కాయినెక్స్ ట్రేడింగ్ సంస్థ… మల్టీ లేవల్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తుందని…. దీనిలో పెట్టుబడులు పెడితే… మీ డబ్బు తక్కువ సమయంలో రెట్టింపు అవుతాయని నమ్మించారు. గుడ్డిగా నమ్మిన సుమారు 12 వందల మంది దాదాపు 10 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు. అయితే పెట్టుబడులు పెట్టిన వారికి కేటుగాళ్లు… నకిలీ సైట్లను క్రియేట్ చేసి… వారి అకౌంట్లో క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ ద్వారా ఎల్లక్ట్రానిక్ కరెన్సీ ఉన్నట్లు చూపించారు. కాయినెక్స్ ట్రేడింగ్ లో పెట్టుబడులు పెట్టించిన వారికి కమీషన్ కూడా ఇస్తామని నమ్మంచారు. దీనిని నమ్మిన కస్టమర్స్.. చాలా మందిని అందులో జాయిన్ చేయించారు. అయితే కస్టమర్ల అకౌంట్లో చూపిన అమౌంట్ ట్రాన్సాక్షన్ చేయలేదు. ఎందుకంటే… ఆ అమౌంట్ క్రిప్టో కరెన్సీ గా చూపిస్తోంది. అంటే… పేరుకే మీ అకౌంట్లో అమౌంట్ అంకెలు ఉంటాయి కానీ అది మీకు రాదు.

పది కోట్లు ముంచేసి……..

ఇలా 10 కోట్ల వరకు ముఠా సభ్యులు… కస్టమర్లకు కుచ్చిటోపి పెట్టి కంపేనీ బోర్డు తిప్పేశారు.అంతేకాదు.. కాయినెక్స్ ట్రేడింగ్ సంస్థకు ఎలాంటి అనుమతులు లేనట్లు పోలీసులు గుర్తించారు. ఓ ఫేక్ వెబ్ సైట్ ను క్రియేట్ చేసి బాదితులను మోసం చేస్తున్నారు ఈ కేటాగాళ్లు. ఎక్కడ కూడా ట్రేడింగ్ చేసినట్లు ఆధారాలు లేదు. ఇక ఈ ముఠా సభ్యులపై హైదరాబాద్ తోపాటు సైబరాబాద్, రాచకొండ, సిద్దిపేట్ లో పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ ముఠా నిఘా పెట్టిన పోలీసులు… ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి… వారి నుంచి కోటీ 80 లక్షల ప్రాపర్టీ, 29 లక్షలు నగదు, ల్యాప్ ట్యాప్, రెండు కార్లను స్వాధనం చేసుకున్నారు. ఇండియాలో మల్టీ లేవల్ మార్కెటింగ్ బిజినెస్ ఇల్లీగల్. మల్టీ లేవల్ మార్కెటింగ్ పేరుతో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*