మంచోడనుకుని వదిలేస్తే….?

హైదరబాద్ టూ ముంబాయ వయా యూపి. ఇప్పడు హైదరాబాద్ కు చేరుతున్న ఆయుధాలు. సిటీ లోని రౌడీ షీటర్లు యూపీకి వెళ్లి ఆయుధాలను కొనుగొలు చేసి ముంబాయ్ మాఫియాకే విక్రయాలు చేస్తున్న తీరు. పాతబస్తీ రౌడీ షీటర్ ను ముంబయ్ లో అరెస్టు చేయడంతో ఆయుధాలు గుట్టురట్టు అయ్యింది. ఓల్డ్ సీటికి చెందిన రౌడీ షీటర్ ఇంట్లో ముంబయ్ పోలీసులు తనిఖీలు చేసినప్పుడు ఈ విషయం బయటపడింది.

ముంబయి లింకులు….

ముంబయ్ మాఫియాకు హైదరబాద్ కు లింకులు బయట పడ్డాయి.. ముంబయ్ లో ఆయుధాలను విక్రయం చేస్తున్న హైదరాబాద్ వాసిని పోలీసులు పట్టుకున్నారు.అక్రమంగా మాఫియా కు ఆయుధాలను అమ్ముతున్న పాతబస్తీ రౌడీ షీటర్ ను అరెస్టు చేశారు. ఈ రౌడీ షీటర్ నుంచి ఆయుధాలను పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. ముంబయ్ మాఫియా హైదరాబాద్ లో పాగా వేయడంపైనా సీటి పోలీసులు ఇప్పడు అప్రమత్తమయ్యారు., పాతబస్తీ రౌడీ షీటర్ ను అరెస్టు చేయడంతో మాఫియా లింకులు మొత్తం బయట పడ్డాయి.

పాతబస్తీకి చెందిన…..

పాతబస్తీకి చెందిన షేక్ వాహిద్. ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేస్తుంటారు. ఇతనిపై పలు క్రిమనల్ కేసులు కూడా వున్నాయి. 2007 నుంచి వాహిద్ పైన రౌడీ షీట్ కూడా వుంది. పాతబస్తీలో జరిగిన పలు అల్లర్లతో కూడా వాహిద్ కు సంబంధాలు వున్నాయి. ఇతను గతంలో పలు మార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. అయితే ఇటివల కాలంలో ఇతని ప్రవర్తన మంచిగా వుందని చెప్పి పోలీసులు ఇతని పైన వున్న రౌడీ షీట్ ను ఎత్తి వేశారు. మంచి వాడు అని సర్టిపికేట్ కూడా ఇచ్చారు.. అయితే తనలో మార్పు వచ్చిందని నమ్మించిన వాహిద్ . అసలు స్వరూపం మాత్రం అలాగే వుంది.

యూపీకి వెళ్లి…..

కొన్నాళ్ల క్రితం వాహిద్ యూపీకి వెళ్లాడు..అక్కడ రెండు రివాల్వర్లు కొనుగొలు చేశాడు. .. వీటిని తీసుకుని హైదరాబాద్ కు వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తరువాత వాటికి బుల్లెట్స్ అవసరయ్యాయి. దీంతో ముంబయ్ మాఫియాను కాంటాక్ట్ చేశాడు. రివాల్వర్లు కొనుగొలు చేసినప్పుడే లైవ్ రౌండ్స్ కూడా ఇస్తామని చెప్పాడు యూపికి చెందిన ఆనంద్. అయితే చెప్పిన మాట ప్రకారం బుల్లెట్స్ ఇవ్వలేదు. దీంతో ఆనంద్ ద్వారా వాహిద్ ముంబయ్ మాఫియాను కాంటాక్ట్ చేశాడు. అక్కడి కి వెళ్లి లైవ్ రౌండ్స్ ను కొన్నారు. వాటిని తీసుకుని హైదరబాద్ వచ్చాడు.

రివాల్వర్లకు గిరాకీ ఉందని…..

ఇటివల కాలంలో ఈ రివాల్వర్స్ కు మంచి గిరాకి వచ్చిందని యూపికి చెందిన ఆనంద్ వాహిద్ కు చెప్పాడు. దీంతో తన దగ్గర వున్న రివాల్వర్లను ముంబయ్ లోని స్దానిక మాఫియాకు అమ్ముతుంటే ఎటిఎస్ బృందం వల పన్ని పట్టుకుంది. ముంబయ్ లో వాహిద్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే ముంబయ్ మాఫియాతో లింకులు బయట పడడంతో ఎమైనా ఉగ్రవాదులతో టచ్ లో వాహిద్ వుండే అవకాశం వుందని భావిస్తున్న పోలీసులు విచారణ ఆరంభించారు.ఈ మేరకు కొర్టు అనుమతితో వాహిద్ ను తమ కస్టడీలోకి పోలీసులు తీసుకున్నారు.

రౌడీషీట్ ఎందుకు ఎత్తివేశారు?

వాహిద్ ను తీసుకుని ముంబయ్ ఎటిఎస్ బృందం హైదరబాద్ కు చేరుకుంది. మాదన్న పెట్ లోని వాహిద్ ఇంట్లో తనిఖీలు చేశారు. హైదరాబాద్ , ముంబయ్ పోలీసులు కలిసి వాహిద్ ఇంట్లో సొదాలు చేశారు. రెండు గంటల పాటుగా తనీఖీలు చేశారు. టెర్రర్ లింక్ పైన ఆరా తీశారు. ఇంట్లో ఎమైనా ఆయుధాలు వున్నయన్న కొణంలో చెకింగ్ చేశామని పోలీసులు చెప్పారు. ఏది ఏమైనా కూడా హైదరబాద్ లింకులపైన పోలీసులు పూర్తిగా ఆరా తీస్తున్నారు. రౌడీ షీటర్ వాహిద్ కార్యకలాపాలపైనా పూర్తిగా అన్ని వివరాలను సిటి పోలీసుల నుంచి ముంబయ్ పోలీసులు తెలుసుకున్నారు. అయితే రౌడీ షీట్ ఎందుకు ఎత్తి వేశారన్న దానిపైన ఇప్పడు సీటి టాప్ కాప్ దృష్టి పెట్టారు. పలు క్రిమినల్ కేసులతో లింకులు వున్నా వాహిద్ పైన రౌడీ షీట్ ఎత్తి వేయడంలో ఎవరి పాత్ర వుందన్న దానిపైన పోలీసులు దృష్టి పెట్టారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*