దొంగంటూ కొట్టి చంపేశారే…!

వారం క్రితం జ‌రిగిన‌ నేతాజీ న‌గ‌ర్ మ‌ర్డర్ కేసు మిస్టరీ వీడి‍ంది.దొంగ‌ అనుకుని అమాయ‌కుడిని దారుణంగా కొట్టి చ‍ంపారు.హ‌త్యకు పాల్పడిన‌ ఆరుగురు నిందితుల‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. లంగ‌ర్ హౌజ్ నేతాజీ న‌గ‌ర్ లో వారం క్రితం లారీ పార్కింగ్ వ‌ద్ద ఓ వ్యక్తి తీవ్ర గాయాల‌తో పడి ఉన్నాడు. ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా మృతి చెందాడు. మృతుని సోద‌రుడు ఇచ్చిన‌ పిర్యాదుతో లంగ‌ర్ హౌజ్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు న‌మోదు చేసుకున్నారు. దీనిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేక‌ ద్రుష్టి పెట్టి అందిన స‌మాచార‍ంతో అనుమానితుల‌ను విచారించ‌గా హ‌త్య కేసులో నిందితులు దొరికిపోయారు.

పరుగెడుతుండగా పట్టుకుని…..

నేతాజిన‌గ‌ర్ ప్రాంతంలో నివ‌సించే అబ్దుల్ సుకూర్ పార్కింగ్ లాట్ తీసుకుని న‌డిపిస్తున్నాడు.ఇటీవ‌ల‌ లారీల‌ బ్యాట‌రీలు దొంగ‌త‌నానికి గురౌతున్నాయి.వారం క్రితం అజ‌య్ సింగ్ అనే వ్యక్తి లారీ పార్కింగ్ ప్రాంతం మీదుగా ప‌రుగెడుతున్నాడు. అత‌నే దొంగ‌ అనుకుని అక్కడే ఉన్న అబ్దుల్ సుకూర్ అత‌ని ప్రెండ్స్ మ‌హ్మద్ హుస్సెన్.అబ్దుల్ స‌హీద్.మహ్మద్ అల్తాప్ సెరూ మ‌హ్మద్ స‌జ్జార్ ల‌తో క‌లిసి అజ‌య్ సింగ్ ను ప‌టుకుని క‌ర్రలు రాడ్ ల‌తో తీవ్రంగా కొట్టారు. ఇందులో ఇద్దరు నిందితులు పోలీస్ డిపార్ట్ మెంట్ కుటుంబాల‌కు చెందిన‌వారు. మృతుడి సోద‌రుడు ఇచ్చిన‌ ఫిర్యాదుతో టాస్క్ పోర్స్ పోలీసులు నిఘా వేసి ఆరుగురు నిందితుల‌ను అరెస్ట్ చేశారు.ఎవ‌రైనా అనుమానితులు ఉంటే పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని, చట్టాన్ని చేతిలోకి తీసుకోరాద‌ని టాస్క్ పోర్స్ డిసిపి రాధాకిష‌న్ రావు తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*