ప్రేమించలేదంటూ…..చంపేశాడు…..!

హైదరబాద్ లో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. చదువుల తల్లి ఉస్మానియా ఒడిలోనే ఈ కిరాతకం చేశాడు. మాట్లాడుకుందామని పిలిచి ఇంటర్ అమ్మాయి గొంతుకొసి హత్య చేశాడు. ఉస్మానియా యూనివర్శటిలో కలకలం రేపిన ఈ హత్యతో క్యాంపస్ మొత్తంఅట్టుడికి పోయింది. ప్రేమ అంటూ వెంట పడ్డాడు. ప్రేమించాలని ప్రాధేయ పడ్డాడు. చివరకు ప్రేమ వద్దు అన్నందుకు కక్ష పెంచుకున్నాడు. తనను ప్రేమించక పొయినా సరే కాని మరొకరితో మాట్లాడినందుకు పగ పెంచుకున్నాడు… మాట్లాడుకుందామని చెప్పి ఇంటర్ అమ్మాయిని పిలిచి గొంతుకోశాడు.

ఇంటర్ చదువుతున్న అమ్మాయిని…..

బిఎస్ఎన్ ఎల్ పనిచేస్తున్న శంకర్ కు ఇద్దరు కూమార్తెలు. ఇద్దరు కూడా ఇంటర్ చదువుకుంటున్నారు..పెద్ద మ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంటే.చిన్నమ్మాయి మొదటి సంవత్సరం చదువుతుంది. నారయణ గూడలోని ఒక ప్రయివేట్ కాలేజీలో వీరుచదువుకుంటున్నారు. తండ్రికి ఇటివల కాలంలో విజయవాడకు బదిలీ అయింది. వారంలో ఐదు రోజులు విజయవాడలో వుండివీకెండ్స్ కు హైదరాబాద్ కు వచ్చిపొతున్నారు. వారసిగూడ పరిధిలోని అంబర్ నగరలో వీరు వుంటున్నారు. ప్రతినిత్యం కూడా ట్యూషన్ కు వెళ్లుతుంటుంది అనూషా. అయితే అదే ట్యూషన్ వద్దకు వెంకటేష్ అనే యువకుడు వస్తుంటాడు. వెంకటేష్ అనూషా వెంట పడ్డాడు. తనను ప్రేమించాలని వేధించాడు.

మాట్లాడుకుందాం రమ్మని……

తనను ప్రేమించక పొతే చంపేస్తానంటూ బెదిరించాడు. అయితే వెంకటేశ్ బెదిరింపులకు లొంగని అనూషా తాను సున్నితంగానే ప్రేమను తిరస్కరించింది. ఇటీవల కాలంలో అనూష మరొకరితో చనువుగా వుంటుంది. ఇది ఇష్టం లేని వెంకటేష్ అనూష పై పగ పెంచుకున్నాడు. మాట్లాడుకుందాం రమ్మని ఫోన్ చేశాడు. పదినిమిషాల్లో వస్తానని ఇంట్లో చెప్పి ఉస్మానియా ‍యూనివర్సిటీకి వచ్చింది. అక్కడే ఉన్న వెంకటేశ్ పక్కనే ఉన్న క్వార్టర్స్ లోకి తీసుకెళ్లాడు. తనను ప్రేమించాలని మరోసారి ప్రాధేయపడ్డారు. అందుకు అనూష అంగీకరించలేదు. దీంతో ఆగ్రహించిన వెంకటేశ్ బ్లేడ్ తో అనూష గొంతుకోశాడు. పారిపోయేందుకు ప్రయత్నించాడు. అనూష అరుపులతో స్థానికులు అప్రమత్తమై పారిపోతున్న వెంకటేశ్ ను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. అనూష మృతి చెందడంతో ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*