రేపు పోస్ట్ మార్టం….!

రోడ్డు ప్రమాదాల్లోనే అనేకమంది టిడిపి నేతలను కోల్పోవడం కలిచి వేస్తోందనిముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మూర్తి మృతి పట్ల ఆయన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో ఫెయిర్ బ్యాంక్స్ నగరం సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయిన ఎంవీఎస్ మూర్తి బృందం (శ్రీ వెలువోలు బసవపున్నయ్య , శ్రీ వీరమాచినేని శివ ప్రసాద్, శ్రీ వి. బి ఆర్ చౌదరి (చిన్న) ) కేసు ని వాస్మన్ మరియు బ్రియాన్ హేలి అనే పోలీస్ అధికారులు ఇతర పోలీస్ అధికారులతో కలిసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి మృతి చెందిన నలుగురి మృతదేహాలు అలస్కా స్టేట్ మెడికల్ ఎగ్సామినేషన్ సెంటర్ లో ఉన్నాయి. ఒక మృతదేహానికి ఆటాప్సీ పూర్తి అయుందని మిగతా మూడు మృతదేహాలకు రేపు ఉదయం ఆటాప్సీ జరుగుతుందని తెలియజేసారు. ఐదవ వ్యక్తి వెంకట కడియాల తీవ్రంగా గాయపడి అలస్కా రీజినల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వెంకట కడియాల వెన్నుముక కి శస్త్ర చికిత్స జరిగిందని కోలుకుంటున్నారని తెలియజేశారు.

పోస్టుమార్టం పూర్తయ్యాక…..

తానా అధ్యక్షుడు సతీష్ వేమన, కార్యదర్శి అంజయ్య లావు, కోశాధికారి రవి పొట్లూరి, మాజీ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర, తానా టీం స్క్వేర్ బృందం అధికారి వాస్మన్ తోను డిటెక్టివ్ జారెడ్ ఫిషర్ తో ప్రమాద వివరాలు తెలిసిన దగ్గర నుంచి అందుబాటులో ఉండి కావాల్సిన సమాచారం అందిస్తున్నారు. తానా అధ్యక్షుడు సతీష్ వేమన కోశాధికారి రవి పొట్లూరి హుటాహుటిన యాంకరేజ్ కి బయల్దేరి వెళ్లారు. అలస్కా తానా టీం స్క్వేర్ మెంబెర్ వినోద్ బండ్ల అలస్కా రీజినల్ హాస్పిటల్ లో తీవ్ర గాయాలతో అలస్కా ఆసుపత్రిలో కోలుకుంటున్నకడియాల వెంకటరత్నం (గాంధీ) ను పరామర్శించారు.తానా బృందం ఐడెంటిఫికేషన్ కోసం పోలీస్ అధికారులకి పూర్తి వివరాలు అందించారు. రేపు ప్రొద్దున్నే పోలీస్ అధికారాలు మూర్తి బృందం బస చేసిన హోటల్ కి వెళ్ళి పాస్ పోర్ట్స్ సేకరిస్తారని తెల్సింది. ఐడెంటిఫికేషన్ పూర్తి అయ్యాక మిగతా అన్ని వివరాలు తెలియజేస్తామని పోలీస్ అధికారి వాస్మన్ తానా బృందానికి తెలిపారు. ఎంవీవీఎస్ మూర్తి కుమారుడు హుటాహుటిన బయలుదేరివెళ్లారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*