నల్గొండను నాశనం చేసిందే ఆయన..

komatireddy venkatareddy indian national congress

నల్గొండలో నిన్న జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నీ అబద్ధాలే మాట్లాడారని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. అసలు నల్గొండ జిల్లాను నాశనం చేసింది, చేస్తోంది కేసీఆర్ అని పేర్కొన్నారు. కేవలం జగదీశ్ రెడ్డి, ఆయన అనుచరులు దోచుకోవడానికి దామరచర్లలో థర్మల్  విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తున్నారని, బుద్ధి ఉన్నాడు ఎవరైనా ఈ రోజుల్లో థర్మల్ ప్రాజెక్టు కట్టడని, థర్మల్ ప్రాజెక్టుతో జిల్లా బూడిదగా మారనుందని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టును ఆపేస్తామన్నారు. కూర్చీ వేసుకుని కూర్చొని ఎస్ఎల్బీసీ సొరంగ పనులు పూర్తి చేస్తాన్న కేసీఆర్ కమీషన్లు దక్కవనే పనులు చేయడం లేదని ఆరోపించారు. రౌడీలకు, దోపిడీదారులకు కేసీఆర్ నల్గొండలో టిక్కెట్లు ఇచ్చారని, రానున్న ఎన్నికల్లో జిల్లాలోని 12 స్థానాల్లో కనీసం 10 స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*