బ్రేకింగ్: టిక్కెట్ దక్కకపోవడంతో…కుటుంబసభ్యులతో సహా….?

తనకు టిక్కెట్ దక్కకపోవడంతో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు స్వీయ నిర్భంధం చేసుకున్నారు. తన ఇంటిలోనే ఆయన కుటుంబ సభ్యులతో సహా నిర్భంధించుకున్నారు. తనకు టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఓదెలు ఈ సరికొత్త ఆందోళనకు దిగారు. చెన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నల్లాల ఓదెలుకు ఇటీవల గులాబీ బాస్ కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో చోటు దక్కలేదు. ఆయన స్థానంలో పార్లమెంటు సభ్యుడు బాల్క సుమన్ కు చెన్నూరు టిక్కెట్ ను కేటాయించారు. కేసీఆర్ ను కలసి తనకు మరోసారి అవకాశమివ్వాలని ఓదెలు కోరినా ఫలితం లేక పోవడంతో ఓదెలు స్వీయ నిర్భంధం చేసుకున్నారు. కార్యకర్తలు, అనుచరులు వచ్చినా ఓదెలు తలుపులు తీయకపోవడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.