నల్లాల ఒదేలుకు కేసీఆర్ ఫోన్

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోన్ చేశారు. రేపు హైదరాబాద్ లో అందుబాటులో ఉండాలని కేసీఆర్ ఫోన్లో చెప్పినట్లు తెలిసింది. చెన్నూరు టిక్కెట్ తనకు దక్కకపోవడంతో ఈరోజు ఉదయం నుంచి నల్లాల ఒదేలు కుటుంబ సభ్యులతో కలసి తన ఇంట్లోనే స్వీయ నిర్భంధం విధించుకున్నారు. కార్యకర్తలు, సన్నిహితులు వెళ్లినా తలుపులు తీయలేదు. తనకు చెన్నూరు టిక్కెట్ ఇవ్వాల్సిందేనంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. చెన్నూరు టిక్కెట్ ను నల్లాల ఒదేలుకు కాకుండా ఎంపీ బాల్క సుమన్ కు కేటాయించిన సంగతి తెలిసిందే. రేపు ఓదేలు హైదరాబాద్ లో కేసీఆర్ తో భేటీ అయ్యే అవకాశముంది. కేసీఆర్ ఫోన్ తో ఆయన స్వీయ నిర్భంధం నుంచి బయటకు వచ్చారు.