హరికృష్ణ నివాసానికి కేసీఆర్

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హరికృష్ణ మృతదేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. మొహిదీపట్నం నివాసంలో ఉంచిన హరికృష్ణ పార్ధీవ దేహానికి అనేకమంది ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నార్కేట్ పల్లి లోని కామినేని ఆసుపత్రి నుంచి హరికృష్ణ బౌతికకాయం వెంటనే హైదరాబాద్ చేరుకున్నారు. నందమూరి జానకిరామ్ కు అంత్యక్రియలు జరిగిన మొయినా బాద్ వ్యవసాయ క్షేత్రంలోనే హరికృష్ణ అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు చెప్పారు. కాగా హరికృష్ణ కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు కేటీఆర్, మహమూద్ ఆలి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు హరికృష్ణ నివాసానికి వచ్చారు. సినీ ప్రముఖులు వెంకటేష్ తదితులు ఇప్పటికే హరికృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించారు. రేపు హరికృష్ణ భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*