బ్రేకింగ్ : హరికృష్ణకు తీవ్రగాయాలు

మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.కొద్దిసేపటి క్రితం నల్లగొండ జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో హరికృష్ణకు తీవ్రగాయాలయ్యాయి. ఆయనను వెంటనే నార్కేట్ పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. నెల్లూరులో ఒక కార్యక్రమానికి హాజరై హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన హరికృష్ణ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*