ఆ సమావేశం వాయిదా…!!

nara chandrababunaidu grand alliance

ఈ నెల 22న తలపెట్టిన బీజేపీయేతర పక్షాల సమావేశం వాయిదా పడిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఈరోజు ఆయన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు ఇద్దరి మధ్య సమావేశం జరిగింది. జాతీయ రాజకీయాల్లో పోషించాల్సిన పాత్రపై చంద్రబాబు మమతతో చర్చించారు. బీజేపీకి వ్యతిరేకంగా చేయాల్సిన పోరాటాలు ఎలా ఉండాల్సిందీ ఆయన మమతకు వివరించారు. అయితే తొలుత ఈ నెల 22న ఢిల్లీలో బేజీపీయేతర పక్షాలన్నీ సమావేశం కావాలని నిర్ణయించారు. కానీ అయిదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందు సమావేశమవుతామని చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకే బీజేపీకి వ్యతిరేకంగా అందరూ ఏకమవ్వాలని ఈ సందర్భంగా మమత పిలుపునిచ్చారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*