బాబూ…నీ డప్పాలు ఆపు

chandrababu naidu latest tweet

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. చంద్రబాబు అమెరికా వెళుతున్నది ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించేందుకు అని డప్పాలు కొట్టుకుంటున్నారని, కాని వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే సమావేశానికి మాత్రమే చంద్రబాబు వెళుతున్నారని జీవీఎల్ అన్నారు. చంద్రబాబు చెప్పేదే నిజమైతే ఐక్యరాజ్యసమితి పంపిన ఆహ్వాన పత్రికను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. న్యూయార్క్ లో సదస్సు పెడితే ఐక్యరాజ్యసమితిలో పెట్టినట్లేనా? అని ఆయన ప్రశ్నించారు. కేవలం బిల్డప్ కోసమే ఐక్యరాజ్యసమితి అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఊదరగొడుతున్నారని, ప్రజలను మోసం చేస్తున్నారని జీవీఎల్ మండి పడ్డారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*