‘‘బాబో’’య్ ఇదేం బిల్లు….!

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు షాకిచ్చారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా మే 23న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాణస్వీకారానికి చంద్రబాబుతో సహా వివిధ పార్టీల నేతలు, జాతీయ నేతలు హాజరయ్యారు. ప్రమాణస్వీకారానికి వచ్చే నేతల కోసం బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్ తో పాటు మరో స్టార్ హోటల్ ను బుక్ చేసింది. అతిథుల బసకు అయ్యే ఖర్చు మొత్తం కర్ణాటక ప్రభుత్వమే భరించింది. కాని మే 23న బెంగుళూరు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మే 24న హోటల్ గదిని ఖాళీ చేశారు. ఇందుకు అయిన ఖర్చు అక్షరాలా 8.7 లక్షల రూపాయలని తేలింది.

చంద్రబాబే ఫస్ట్……

కుమరస్వామి ప్రమాణస్వీకారానికి ఎంత ఖర్చయిందో తెలపాలని ఆర్టీఏ కార్యకర్త ఒకరు కోరగా ఈ వివరాలు వెల్లడించారు. అలాగే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ 1.02 లక్షలు, మాయావతి 1.41 లక్షలు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ 1.02 లక్షలు, శరద్ పవార్ 64 వేలు, కమల్ హాసన్ కు 1.02 లక్షలు ఖర్చయిందని ప్రభుత్వం తెలిపింది. ఇందులో చంద్రబాబునాయుడు బిల్లు మాత్రం అదిరిపోయింది. ఈ విషయాన్ని ఓ జాతీయ పత్రిక వెల్లడించింది. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి అతిథి మర్యాదలకే 42 లక్షలు ఖర్చు కావడం పట్ల విస్తుపోతున్నారు. అందరికంటే చంద్రబాబునాయుడు ఖర్చే తడిసి మోపెడయ్యింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*