బ్రేకింగ్ : లేక్ వ్యూ ‘‘వ్యూస్’’ ఏంటంటే?

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ నేతలతో లేక్ వ్యూ అతిధి గృహంలో సమావేశమయ్యారు. సుదీర్ఘంగా గంటసేపు ఆయన తెలంగాణ రాజకీయాలపై చర్చించారు. పొత్తుతోనే ఎన్నికలకు వెళ్లాలన్న క్లారిటీ ఇచ్చారు. దాదాపు కాంగ్రెస్ తో వెళ్లేందుకే ఎక్కువమంది టీటీడీపీ నేతలు సుముఖత వ్యక్తం చేశారు. కొందరు నేతలు టీఆర్ఎస్ తో వెళదామనుకున్నప్పటికీ కేసీఆర్ 105 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించడం, ఆ తర్వాత టీడీపీపై విమర్శలు చేయడంతో ఆ పార్టీతో వెళ్లకూడదని నిర్ణయించింది. కాంగ్రెస్ తో కలసి వెళ్లాల్సి వస్తే ఎన్ని అసెంబ్లీ సీట్లు కోరాలన్న దానిపై పార్టీ నేతల నుంచి అభిప్రాయాలను సేకరించారు. లోక్ సభ ఎన్నికలు ఇప్పుడు జరగవు కాబట్టి లోక్ సభ స్థానాలను పక్కన పెట్టి పార్టీకి కేటాయించాల్సిన స్థానాల జాబితాను రూపొందించాలని టీటీడీపీ నేతలను చంద్రబాబు ఆదేశించారు. తిరిగి మధ్యామ్నం 2.30గంటలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పొత్తులపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*