బిగ్ బ్రేకింగ్ : బాబుకు భారీ షాక్

narachandrababu naidu in crisis

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు పెద్ద షాక్ తగలనుంది. తనకు అత్యంత నమ్మకస్థుడైన నేత పార్టీకి దూరమవుతున్నారు. టీటీడీ మాజీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి జనసేనలో చేరుతన్నారు. దీంతో తిరుపతిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారనున్నాయి. చదలవాడ కృష్ణమూర్తి కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేనాని పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యారు. దసరా రోజున జనసేనలో చదలవాడ కృష్ణమూర్తి చేరతారని తెలుస్తోంది. చదలవాడ జనసేనలో చేరితే తిరుపతిలో ఆయనే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి అవుతారు. చంద్రబాబుకు అత్యంత నమ్మకంగా ఉన్న చదలవాడ పార్టీని వీడటం చర్చనీయాంశమైంది. మరి బాబు చదలవాడను బుజ్జగిస్తారా? లేదా? అన్నది చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*