హత్యాయత్నం కేసులో కొత్త కోణం..!

attack on ys jaganmohanreddy

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో కొత్త వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) నుంచి పలు వివరాలు కోరుతూ లేఖ రాశారు. విజయసాయిరెడ్డి ప్రశ్నలకు బీసీఏఎస్ డైరెక్టర్ జనరల్ కుమార్ రాజేశ్ చంద్ర సమాధానాలు ఇస్తూ లేఖ రాశారు. ఈ లేఖలో కీలక వెలుగులోకి వచ్చాయి.
– నిందితుడు శ్రీనివాసరావు కానీ అతడు పనిచేస్తున్న క్యాంటీన్ యాజమాని హర్షవర్ధన్ కానీ శ్రీనివాసరావుకు సంబంధించి ఎయిర్ పోర్టులోకి ప్రవేశించడానికి అవసరమైన ఏరోడ్రోమ్ ఎంట్రీ పర్మిట్ అప్లికేషన్ ఫారం(ఏఈపీఏఎఫ్) ఎయిర్ పోర్టు సెక్యూరిటీ విభాగానికి అందించలేదు.
– దీంతో నిందితుడు శ్రీనివాసరావు క్యాంటీన్లో పనిచేయడానికి బీసీఏఎస్ ఎటువంటి అనుమతి ఇవ్వలేదు.
– కేవలం అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు మాత్రమే ఎయిర్ పోర్టులోకి రావడానికి శ్రీనివాసరావుకి తాత్కాలిక పర్మీషన్ ను ఇచ్చారు. జగన్ పై ఘటన జరిగింది అక్టోబర్ 25న. అంటే తాత్కాలిక పర్మిషన్ ముగుస్తుందనగా ఘటనకు పాల్పడ్డాడు.
– శ్రీనివాసరావుకి గానీ, హర్షవర్ధన్ కి గానీ ఎయిర్ పోర్టులోని కీలక ప్రదేశాలకు వెళ్లడానికి ఎటువంటి అనుమతులు లేవు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*