డీఎంకేకి కొత్త అధ్యక్షుడు..!

డీఎంకే కొత్త అధ్యక్షుడిగా కరుణానిధి కుమారుడు ఎం.కే.స్టాలిన్ ఎన్నికయ్యారు. ఆయన అధ్యక్ష పదవికి నామినేషన్ వేయగా ఎవరూ పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకటించారు. 70 ఏళ్ల డీఎంకే చరిత్రలో స్టాలిన్ ఆ పార్టీకి మూడో అధ్యక్షుడు. 50 ఏళ్ల తర్వాత పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. స్టాలిన్ ఎన్నికతో డీఎంకే శ్రేణులు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద సంబరాలు చేసుకుంటున్నారు. డీఎంకే కోశాధికారిగా సీనియర్ నేత దురైమురుగన్ ఎన్నికయ్యారు.