ప్ర‌ధానిని అంత‌మాట అంటారా..? నిర్మ‌లా సీతారామ‌న్ ఆగ్ర‌హం

ప్ర‌ధానిని ఉద్దేశించి మోస‌గాడు అంటు వ్యాఖ్యానించిన టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ వ్యాఖ్య‌ల‌పై కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్ మండిప‌డ్డారు. ఎంపీ వ్యాఖ్య‌ల‌ను రికార్డుల నుంచి తొల‌గించాల‌ని స్పీక‌ర్ ను కోరారు. తెలుగుదేశం పార్టీపై బీజేపీ ఎంపీ రాకేష్ సింగ్ కూడా మండిప‌డ్డారు.

అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ‌లో భాగంగా ఆయ‌న మాట్లాడుతూ…రాష్ట్ర విభ‌జ‌న చేసిన కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం చేతులు క‌లిపింద‌న్నారు. శాప‌గ్ర‌స్థులైన కాంగ్రెస్ పార్టీతో క‌లిసి టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టి ఆ పార్టీ కూడా శాప‌గ్ర‌స్థం అయ్యింద‌ని పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో చేతుల క‌లిపిన క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి ఏడుస్తున్నార‌ని గుర్తుచేశారు. మోదీ పాల‌న‌లో ప్ర‌తీ పేద‌వాడి ముఖంలో చిరున‌వ్వు క‌నిపిస్తోంద‌ని, పేద‌ల అభ్యున్న‌తికి బీజేపీ కృషి చేస్తుంద‌ని పేర్కొన్నారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*