బ్రేకింగ్ : ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఉద్రిక్తత

తెలంగాణ లో టిక్కెట్ల కేటాయింపు పై తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. శేరిలింగంపల్లిలో టిక్కెట్ ను పార్టీ భవ్య ఆనంద్ ప్రసాద్ కి కేటాయించింది. దీంతో ఈ టిక్కెట్ ఆశించిన మొవ్వా సత్యనారాయణ అనుచరులు పెద్దఎత్తున ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు చేరుకుని ఆందోళనకు దిగారు. ఓ కార్యకర్త పార్టీ వైఖరికి నిరసగా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పార్టీ కోసం కష్టపడిన వ్యక్తికి కాకుండా డబ్బులున్న వ్యక్తికి టిక్కెట్ ఇచ్చారని వారు ఆరోపిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*