బ్రేకింగ్ : ఏపీలో ఆపరేషన్ “బి” …త్వరలోనే…??

bode prasad telugudesamparty

ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ బి త్వరలోనే ప్రారంభమవుతుందని ప్రముఖ సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజ తెలిపారు. రేపటి నుంచి పదిహేను రోజుల్లోగా ఈ ఆపరేషన్ ప్రారంభమవుతుందని తెలిపారు. నిన్న మొన్నటి వరకూ వ్యాపారస్థులపై జరిపిన ఐటీ, ఈడీ దాడులు ఈసారి నేరుగా పార్లమెంటు సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలపై జరుగుతాయని తమ్మారెడ్డి ఒక న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

నలుగురు మంత్రులు…..

గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నలుగురు మంత్రులు, 24 మంది వివిధ వ్యాపారాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, విజయవాడలోని రెండు ప్రముఖ హోటళ్ల యజమానులు, విజయవాడ-గుంటూరు మధ్య ఉన్న ఒక ప్రయివేటు యూనివర్సిటీ అధినేతపై ఐటీ, ఈడీ దాడులు జరగబోతున్నట్లు తమ్మారెడ్డి తెలిపారు. ఇందుకోసం పీఎంవోలో ఒక అధికారి ప్రత్యేకంగా పనిచేస్తున్నారని కూడా చెప్పారు. అయితే ఇందులో నిజానిజాలు తనకు పూర్తిగా తెలియవని, తనకు అందిన సమాచారాన్నే బయటపెడుతున్నానని తమ్మారెడ్డి చెప్పడం విశేషం. జాతీయ రాజకీయాల్లో బాబు చురుగ్గా పాల్గొనకుండా ఉండేందుకే ఈ దాడులు జరగుతాయని ఆయన జోస్యం చెప్పారు.

1 Comment on బ్రేకింగ్ : ఏపీలో ఆపరేషన్ “బి” …త్వరలోనే…??

Leave a Reply

Your email address will not be published.


*