బూర్ఖాతో లేడీస్ హాస్టల్ వెళ్లి…పట్టాలపై తేలాడు

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఓ యువకుడి ఆత్మహత్య సంచలనం సృష్టించింది. మహబూబ్ నగర్ జిల్లా మద్దూరు మండలం బూనీడు గ్రామానికి చెందిన సద్దాం హుస్సైన్(21) పాలమూరు విశ్వవిద్యలయంలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీలో పీజీ చేస్తున్నాడు. అయితే, ఈనెల 16న ఆయన తన స్నేహితురాలితో కలిసి బుర్ఖా ధరించి లేడీస్ హాస్టల్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన కొందరు విద్యార్థినులు హాస్టల్ వార్డెన్ కు ఫిర్యాదు చేశారు. వార్డెన్, హాస్టల్ సిబ్బంది అతనిని పట్టుకుని తీవ్రంగా మందలించారు. తప్పు చేశానని ఓ లెటర్ కూడా రాయించుకున్నారు. ఫోన్ తీసుకుని పంపించేశారు. ఫోన్చె కోసం రేపు రావాలని చెప్పారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిన సద్దాం సమీపంలోని రైల్వే పట్టాలపై అదే రోజు శవమై తేలాడు. తాను చేసిన పనికి రేపు ఏం జరుగుతుందోనని భయపడి అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే మొదట గుర్తుతెలియని మృతదేహంగా రైల్వే పోలీసులు కేసు నమోదు చూసుకున్నారు. పత్రికల్లో చూసిన తల్లిదండ్రులు మృతుడు తమ కుమారుడే అని గుర్తుపట్టి తల్లడిల్లారు. కుమారుడి మరణంపై పూర్తి విచారణ జరిపించాలని వారు కోరారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*