పవన్ ఇందుకోసమే రావడం లేదా?

జనసేనపై కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ‌్ ఆరోపించారు. తనకు వస్తున్న అపార ప్రజాదరణను చూసి ఓర్వలేని కొందరు తన పర్యటనల్లో అరాచకం చేయాలని చూస్తున్నట్లు తనకు నిఘా నివేదికలు అందాయని పవన్ ఆరోపించారు. అందుకే గుంటూరు, చిత్తూరు జిల్లా పర్యటనలను వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. పవన్ కల్యాణ్ వాస్తవానికి గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. గుంటూరు జిల్లా బాపట్ల, చిత్తూరు జిల్లాలోని పలుచోట్ల పర్యటన చేసేందుకు పవన్ ప్లాన్ చేసుకున్నారు. అయితే తన పర్యటనలో పొరుగు రాష్ట్రాల నుంచి కిరాయి మూకలను తెప్పించి తుని సంఘటనల్లాంటివి కొందరు చేయాలని భావించారని, అయితే నిఘావర్గాలు అప్రమత్తం చేయడంతో తాను పర్యటనను వాయిదా వేసుకున్నానని పవన్ తెలిపారు. ఈనెల 30న కామన్ వెల్త్ గేమ్స్ లో పతకాన్ని సాధించిన రాహుల్ ను పవన్ సన్మానించాల్సి ఉంది. స్టూవర్టుపురంలోనూ పాదయాత్ర చేయాల్సి ఉంది. అయితే నిఘా వర్గాల హెచ్చరిక కారణంగా పవన్ తన పర్యటనను వాయిదా వేసుకున్నట్లు వెల్లడించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*