పవన్..ఊపేసే పనైతే ఊరకెందుకున్నావ్…?

తాను అసెంబ్లీ లో ఉంటే ప్రతిపక్ష నేత జగన్ లా తాను పారిపోయేవాడిని కానని పవన్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. అంత ఊపేసే వాడివయితే 2014 ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. రాజ్యసభ సీటు ఇస్తానని చంద్రబాబు ఆఫర్ ఇస్తానని చెప్పిన పవన్, అది ఇవ్వలేదనే బయటకు వచ్చారా? అని నిలదీశారు. అంతగా అసెంబ్లీలో ఊపేసే పనయితే ప్రజారాజ్యం సమయంలో ఎందుకు పోటీ చేయలేక పోయారన్నారు. తనకు తాను నిజాయితీ పరుడిగా పవన్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారన్నారు. అధికార పార్టీని విమర్శించకుండా ప్రతిపక్ష పార్టీని తప్పుపట్టడం ఒక్క పవన్ కే చెల్లిందన్నారు అంబటి రాంబాబు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*