ఆ విషయం ఫిబ్రవరిలో చెబుతా..!

Pawan Kalyan about contesting elections

తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది ఫిబ్రవరిలో క్లారిటీ ఇస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి గుర్తించనంత మాత్రాన తమ పార్టీకి బలం లేనట్లు కాదని, ఒక్క పిలుపునిస్తే లక్షల మంది కవాతుకు తరలివచ్చారని పేర్కొన్నారు. తమ బలాన్ని అంచనా వేసుకునేందుకు రాష్ట్రంలో 175 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

సీమకు బాబు అన్యాయం……

చంద్రబాబు మోసపూరితంగా పాలిస్తున్నారని, ఆయన పాలనలో సీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రెయిన్ గన్స్ ద్వారా కరువు తరిమేశామని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు. రాయలసీమలో వలసలు తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. తాము అంబేడ్కర్ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్లం కాబట్టి రావెల కిషోర్ బాబు ఆరు నెలల సమయం ఉన్న ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసి తమ పార్టీలో చేరారని, చంద్రబాబు, జగన్ ఇలా ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*