తిరగబడింది అందుకే….!!!

pawan kalyan comments on telangana

తాను పార్టీ పెట్టినప్పుడు ఒకడినేని ఇప్పుడు తన వెనక సైన్యం ఉన్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జగన్, చంద్రబాబులపై తనకు వ్యక్తిగత ద్వేషమేదీ లేదన్నారు. వారు నన్ను వ్యక్తిగతంగా దూషించినందుకే తాను తిరగబడాల్సి వచ్చిందన్నారు. తనకు ముఖ్యమంత్రి కావాలన్న కోరిక ఏమీ లేదన్నారు. రాజమండ్రిలో జరిగిన ఆవిర్భావ సభలో పవన్ ఆవేశంగా ప్రసంగించారు. 2014 ఎన్నికలలో తాను ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ఇచ్చానన్నారు. కానీ వారు తనను పల్లకీ మోసే వాడిగానే చూశారని చెప్పారు. తనను కాపు లీడర్ గానే వారు చూస్తున్నారని చెప్పారు. తనకు కులం, మతం, ప్రాంతం లేదన్నారు. జనసేనకు ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద బలంగా ఉందన్నారు.

జగన్ లాగా తాను….

అన్యాయంపై గళమెత్తడానికే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ చెప్పారు. డబ్బులుంటే చాలు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవ్వాలనుకుంటున్నారని, తాను మాత్రం ప్రజాసేవ చేసే వారికే సీట్లు ఇస్తానని తెలిపారు. తనకున్నగుండె ధైర్యమే తనను ముందుకు నడిపిస్తుందన్నారు. ఆ ధైర్యంతోనే ఒంటరిగా బరిలోకి దిగుతున్నానన్నారు. జగన్ లాగా తాను బీసీ సదస్సులను పెట్టనని, పార్టీలో ఇప్పటికే 30 మంది బీసీలకు సీట్లు ఇచ్చినట్లు పవన్ చెప్పుకుచ్చారు. టీడీపీ నుంచి కోరుకుంది ప్రజలకు అండగానిలబడతారనేనని, కానీ ప్రజా సమస్యలు పట్టించుకోకుండా రాజకీయాలు చేస్తున్నారన్నారు. తెలుగుజాతి ఐక్యతకు జనసేన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. రెడ్డి అంటే కులం కాదని, అన్యాయాన్ని ఎదిరించిన వారే రెడ్డి అని అన్నారు.కొందరు కులాన్నినీచంగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు.

Ravi Batchali
About Ravi Batchali 15248 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*