ఏపీలో జనసేన తొలి అభ్యర్థి ఈయనే

ఆంధ్రప్రదేశ్ లో తొలి అభ్యర్థిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆయన ఈరోజు పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా ముమ్మడి వరం అభ్యర్థి పితాని బాలకృష్ణ అని ఆయన ప్రకటించారు. తాను తొలుత బీ ఫారంను పితానికే ఇస్తానని జనసేనాని ప్రకటించడం సంచలనమే అయింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పితాని బాలకృష్ణ తన అనుచరులతో కలసి వచ్చి పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. అయితే ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తనను ఆయన గతంలో కలిశారని, అయితే ఆయనకు సీటుఇస్తానన్న హామీ అప్పుడు ఇవ్వలేదన్నారు. కానీ ఈరోజు తాను చెబుతున్నానని, తాను తొలుత బిఫారం ఇచ్చే వ్యక్తి పితాని మాత్రమేనని పవన్ చెప్పడం విశేషం.