హత్యకు ముందే కిడారికి పోలీసులు….?

kidarisarveswararaomavoists murder

నిన్న మావోయిస్టుల చేతిలో హతమైన విశాఖపట్నం జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకు ముందు పోలీసులు నోటీసులు పంపించారు. మావోయిస్టు పార్టీ వారోత్సవాలు జరుగుతున్నందున పోలీసుల‌ అనుమతి లేకుండా నియోజకవర్గం లో పర్యటించరాదని ఎమ్మెల్యేకు డుంబ్రిగుడ ఎస్సై అమ్మన్ రావు నోటీసు పంపించారు. దీనికి ఎమ్మెల్యే కిడారి సైతం సంతకం చేసి తిరిగి ఎస్సైకు పంపించారు. కిడారి మావోయిస్టుల టార్గెట్ గా ఉన్నందున పోలీసులు ఈమేరకు ఆయనకు సూచనలు చేశారు. ఇక ఎమ్మెల్యే హత్య, అనంతపరం జరిగిన అల్లర్లను నివారించడంలో విఫలమయ్యారనే కారణంతో ఎస్సై అమ్మన్ రావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*