బ్రేకింగ్ : రేవంత్ రెడ్డికి నోటీసులు..!

కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డికి ఎన్నికల ముందు తిప్పలు తప్పేలా లేవు. జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీలో అక్రమాల కేసులో రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సొసైటీ ప్లాట్లను అక్రమంగా విక్రయించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో రేవంత్ రెడ్డితో పాటు మరో 13 మందికి కూడా నోటీసులు అందాయి. 15 రోజుల్లో తమ ముందుకు విచారణకు రావాలని రేవంత్ రెడ్డిని పోలీసులు ఆదేశించారు. అయితే, ఇప్పటికే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డిలపై కూడా పోలీసులు పాత కేసుల్లో చర్యలు మొదలుపెట్టారు. ఎన్నికల ముందు కక్షపూరితంగా తమపై ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.