ఎవరీ సోని-రాహుప్రయ..! బెజవాడలో పోస్టర్ల కలకలం

మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య మరవకముందే హైదరాబాద్ బోరబండలో మాధవి, సందీప్ పై పరువు కత్తి దాడి చేసింది. తమ కూతుళ్లు కులాంతర వివాహాలు చేసుకున్నారనే కోపంతో మిర్యాలగూడలో మారుతీరావు, బోరబండలో మాధవచారి కక్ష పెంచుకుని హత్యలు చేయడానికి పూనుకున్నారు. ఈ రెండు ఘటనలు ఇంకా మరిచిపోక ముందే విజయవాడలో వేసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ‘సోని రాహు ప్రయ’ పరువు హత్యకు గురికాబోతున్నారు అంటూ సత్యనారాయణపురంలోని శివాలయం వీధి నిండా పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. దీంతో సోని రాహు ప్రయ ఎవరని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*