ప్రగతి నివేదన సభకు తొలిగిన అడ్డంకి

high court on panchayath elections

టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభకు అనుమతిని రద్దు చేయాలని వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టేసింది. టీఆర్ఎస్ సెప్టెంబర్ 2న కొంగరకలాన్ లో నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు అనుమతి ఇవ్వకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పూజారి శ్రీధర్ పిటీషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తన నివేదికను ప్రకటించాలనుకుంటే నూతన టెక్నాలజీ ద్వారా సామాజిక మాద్యమాల ద్వారా చేయాలని, ఇలా సభలు పెట్టి ప్రజలను, పర్యావరణ పరిరక్షణకు ఇబ్బందులు కలగజేయకుండా చూడాలని పిటీషన్ వేశారు. ఈ రోజు పిటీషన్ ను హైకోర్టు విచారించింది. పర్యావరణ పరిరక్షణకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చేస్తామని, ఇప్పటికే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కోర్టుకు ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ వివరణ ఇచ్చారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా సభ జరుపుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ ఈ మేరకు హామీ ఇవ్వడంతో పిటీషన్ ను కొట్టివేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*