బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

దేశంలోకి అక్రమంగా చొరబడి నివసిస్తున్న వారితో దేశానికి ముప్పు పొంచి ఉందని హైదరాబాద్ గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పేర్కొన్నారు. అలా చొరబడిన వారిని దేశం నుంచి పంపించాలని, వారు వెళ్లకపోతే కాల్చేయాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అస్సాంలో 40 లక్షల మందికి భారత పౌరసత్వం ఇచ్చే ముసాయిదాలో చోటు దక్కని నేపథ్యంలో రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ 40 లక్షల మందిని విదేశీయులుగా ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ… బంగ్లాదేశీయులు, రోహింజ్యా ముస్లింలు దేశంలోకి అక్రమంగా చొరబడి ప్రమాదకరంగా మారారని ఆరోపించారు. విదేశీయులను భారత్ లో ఉంచడం ఎంతవరకు సరైనదని ఆయన ప్రశ్నించారు. అటువంటి వారిని భారత్ లో ఉండనివ్వద్దని, ఇతర దేశాలైతే వారిని కాల్చేసేవని చెప్పారు. రోహింజ్యాలు, బంగ్లాదేశీయులు దేశం విడిచి వెళ్లకపోతే వారిని కాల్చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇంతకుముందు కూడా రాజాసింగ్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పాతబస్తీని మినీ పాకిస్తాన్ తో పోల్చిన విషయం తెలిసిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*