రాజయ్య ఇరుక్కున్నారే….!

మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే టి.రాజయ్యకు ఆడియో టేపుల వివాదం చుట్టుముట్టింది. ఆయన ఎప్పుడు మాట్లాడారో తెలయదు కాని, ఒక మహిళతో జరిగిన అసభ్యకరమైన సంభాషణ ఇప్పుడు తెలంగాణలోనూ, గులాబీ పార్టీలోనూ కలకలం రేపుతుంది. స్టేషన్ ఘన్ పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రాజయ్యకు మళ్లీ టిక్కెట్ కేటాయించారు గులాబీ బాస్. అయితే తాజాగా విడుదలయిన ఆడియో టేపులతో రాజయ్య అసమ్మతి వాదులు ఆయనకు టిక్కెట్ కేటాయించడంపై పునరాలోచించాలని కోరుతున్నారు.

అసంతృప్తి వర్గాల ఆందోళన……

మహిళలను కించపరుస్తూ రాజయ్య చేసిన వ్యాఖ్యలనూ స్థానిక టీఆర్ఎస్ నాయకుడు సూదుల రత్నాకర్ రెడ్డి స్టేషన్ ఘన్ పూర్ లో అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో తనపై కుట్ర జరుగుతోందని, ఆ మహిళ ఎవరో తనకు తెలియదని, దీనిపై నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయని రాజయ్య అంటున్నారు. మొత్తం మీద రాజయ్య ఆడియో టేపుల వ్యవహారం గులాబీ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఇదే తరహాలో వరంగల్ జిల్లాకు చెందిన గండ్ర వెంకటరమణారెడ్డిపై గతంలో ఓ మహిళ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.