పెళ్లిపై ఆసక్తికర విషయాలు చెప్పిన రేణూ..!

గతంలో రేణూ దేశాయ్ హీరోయిన్ గా ఎంటరైనప్పుడు పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమాలో నటించింది. ఆ సినిమాతోనే రేణూ దేశాయ్, పవన్ కళ్యాణ్ లు ప్రేమలో పడ్డారు. అయితే ప్రేమలో పడిన ఈ జంట వెంటనే పెళ్లి చేసుకోలేదు. చాలాకాలం సహజీవనం చేసిన వీరికి ఒక బిడ్డ (అకిరా) పుట్టిన తర్వాత పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరికి ఆద్య పుట్టింది. అయితే కొన్నాళ్ల క్రితం విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ లు ఎవరి జీవితంలో వారు బిజీ అయ్యారు. ఇక పవన్ మళ్లీ అన్న లేజ్నోవాతో కొన్నాళ్లు సహజీవనం చెయ్యడం.. తర్వాత పెళ్లి కూడా చేసుకోవడం జరిగాయి.

ప్రేమ ఒకేసారి పుడుతుంది…

ఇక రేణూ దేశాయ్ తన పిల్లలతో కొన్నాళ్లు ఒంటరిగా గడిపాక తాజాగా ఆమె వేరో వ్యక్తి తో పెళ్లికి సిద్దమయ్యింది. అయితే ఈ పెళ్లి ప్రేమ పెళ్లి కాదని.. తనది సన్నిహితులు కుదిర్చిన వివాహమని ఒక ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో రేణూ చెప్పింది. లైఫ్ లో ఒక్కసారే ప్రేమలో పడటం జరుగుతుందని…. ఆ ప్రేమ కూడా ఒక్కసారే పుడుతుందని చెప్పింది. గత ఏడేళ్లుగా తాను ఒంటరి జీవితాన్ని గడిపానని.. ప్రస్తుతం తాను సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. ఇక తనకి పెళ్లిపై ఎంతమాత్రమూ ఆతృత లేదని చెప్పింది.

వివరాలు బయటపెట్టకుండా…

ఇక రెండు రోజుల క్రితం అతనితో నిశ్చితార్ధం జరిగిందని… తనకు కాబోయే భర్త చాలా ప్రశాంతంగా ఉంటాడని కాబోయే భర్తపై ప్రశంసలు కురిపించిన రేణూ దేశాయ్, మళ్లీ సహజీవనం చేయాలని అనుకోవడం లేదని, అందుకే సంప్రదాయంగా పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చానని చెప్పింది. కానీ తన భర్త వివరాలు, అతని ఫోటోని రేణూ ఎక్కడా బయట పెట్టలేదు.అయితే రేణూ దేశాయ్ వివాహం సందర్భంగా ఆమె మాజీ భర్త, స్టార్ హీరో, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసిన విషయం తెలిసిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*