హరీష్ రావును కేసీఆర్ గెంటేయడం ఖాయం

తనపై ఎంతమంది ‘రావులు’ కేసులు పెట్టినా భయపడనని, కేసీఆర్ కుటుంబం దోపిడీని ప్రశ్నిస్తూనే ఉంటానని కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ… టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు తీవ్రంగా జరుగుతుందని, మంత్రి హరీష్ రావును కేసీఆర్ త్వరలోనే పార్టీ నుంచి గెంటేయడం ఖాయమని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకు ఇంతకుముందు ఎంపీ కవిత మద్దతు ఇచ్చారని, ఇప్పుడు మాత్రం హరీష్ రావు, వినోద్ వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా తమ నిర్ణయాలు ఉండవని, ప్రత్యేక హోదాపై సీడబ్లూసీ నిర్ణయమే తమ పార్టీలో ఫైనల్ అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ తలుపులు మూసి, లైవ్ కట్ చేసి మరీ బిల్ పాస్ చేసిందని ఆయన గుర్తు చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*