రేవంత్ రెడ్డి మరోసారి….?

kodangal fight revanth reddy

మరికాసేపట్లో బషీర్ బాగ్ లోని ఆదాయపు పన్ను శాఖ అధికారుల ముందు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో విచారణకు హాజరవుతానని అధికారులకు ఇప్పటికే రేవంత్ రెడ్డి తెలిపారు. కొద్దిరోజుల క్రితం రేవంత్ రెడ్డి ఇంట్లో సోదాల అనంతరం ఆయనకు నోటీసులు ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల మూడో తేదీన విచారణకు హాజరైన రేవంత్ ని దాదాపు నాలుగున్నర గంటలపాటు అధికారులు విచారించారు. ఈనెల 23వ తేదీన మరోసారి తమముందుకు రావాలని ఆదేశాలు జారీ చేయడంతో రేవంత్ తో పాటు ఆయన అనుచరుడు ఉదయసింహ, మామ పద్మనాభ రెడ్డి, శ్రీ సాయి మౌర్య కంపెనీ డైరెక్టర్లు ప్రవీణ్ రెడ్డి, సురేష్ రెడ్డి, శివ రామిరెడ్డి, రామచంద్రారెడ్డిలు సైతం విచారణకు ఈరోజు హాజరుకానున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*