ఛీ… ఇదేం సెల్ఫీ పిచ్చిరా నాయనా..!

సెల్ఫీ పిచ్చి సమాజంలో పడిపోతున్న మానవ విలువలకు అద్దం పడుతోంది. సందర్భంతో పని లేకుండా, మానవత్వం మరిచిపోయి సెల్ఫీల మత్తులో మునిగిపోతున్నారు కొందరు. ఈ పిచ్చితోనే కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుండగా, మరికొందరు సెల్ఫీలతో వికృత ఆనందం పొందుతున్నారు. తాజాగా, నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి గురికావడం, నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రిలో కన్నుమూయడం తెలిసింది. అయితే, ఈ ఘటనలో ఇప్పుడు బయటకు వచ్చిన ఓ సెల్ఫీ ఫోటో సభ్యసమాజానికి సిగ్గు చేటుగా అనిపిస్తోంది. హరికృష్ణను కామినేని ఆసుపత్రికి చేర్చాక అక్కడి సిబ్బంది ఆయనతో ఓ సెల్ఫీ తీసుకున్నారు. పైగా నవ్వు మోహాలతో. అప్పటికి హరికృష్ణ ప్రాణంతోనే ఉన్నారో లేదో తెలియదు కానీ, ఈ విషాద సమయాన మానవత్వం మరిచి వీరు తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరు సెల్ఫీ పిచ్చి చూసిన నెటిజన్లు వీరిపై దెమ్మెత్తిపోస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*