కాంగ్రెస్ లోకి సీనియర్ నేత

ఎన్నికల వేళ పార్టీల మార్పులు వేగంగా తెలంగాణలో ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ స్పీకర్ కే.ఆర్.సురేష్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసింది. ఇక మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డీ.కే.సమరసింహారెడ్డి కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఆయన శుక్రవారం సాయంత్రం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంఛార్జి ఆర్.సి.కుంతియా సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.