మృగాళ్లున్నారు జాగ్రత్త….!

మాయమ‌వుతున్నడ‌మ్మా…. మ‌నిష‌న్నవాడు అన్నాడో క‌వి..స‌మాజం సిగ్గుతో త‌ల‌దించుకునేలా కొంద‌రు మ‌నిష‌నే ప‌దానికే క‌ళంకం తీసుకువ‌చ్చే నీచ ప‌నుల‌కు తెర‌లేపుతున్నారు. మంచేదో..!? చేడేదో..!? తెలియ‌ని చిన్నారుల‌ను న‌య‌వంచ‌న‌కు గురిచేస్తున్నారు. పైశాచిక ఆనందం పొందుతున్నారు. కేవ‌లం ఒక్క రోజులోనే భాగ్యన‌గ‌రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆరు లైంగిక వేధింపుల‌ కేసులు న‌మోదు కావ‌డం అశ్చర్యానికి గురిచేస్తోంది. ఎటు పోతోంది ఈ స‌మాజం అనే సందేహం క‌ల‌గ‌క మాన‌డంలేదు.

చిన్నారులకు దిక్కెవరు?

త‌స్మాత్ జాగ్రత్త… మీ చుట్టు ప‌క్కల మాన‌వ రూపంలో మృగాళ్లు తిరుగుతున్నారు. కామ‌వాంఛ తీర్చుకోవ‌డానికి ఎలాంటి నీచ్ క‌మీన్ ప‌నుల‌కైనా సై అంటున్నారు కొంద‌రు న‌య‌వంచ‌కులు . అర్ధరాత్రి ఆడ పిల్ల నిర్భయంగా తిరిగిన‌ప్పుడే అస‌లైన స్వాతంత్రం అన్న మ‌హానుభావుడు గాంధీ…..క‌ట్ చేస్తే.. మ‌న ఇంటి ప‌రిస‌ర ప్రాంతాల్లోనే చిన్నారులు ,అమ్మాయిలు మ‌హిళ‌లు తిర‌గాలంటేనే ఒక్క క్షణ్ణం అలోచించాల్సిన ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయా..!? అని సందేహం ప‌డ‌డంలో ఏ మాత్రం త‌ప్పులేదు. ఇలా అన‌డానికి ఇటీవ‌ల భాగ్యన‌గ‌రంలో చిన్నారులు, వివాహిత‌లు , అమ్మాయిల పై అత్యాచారం, అత్యాచారయ‌త్నం.. ఇలా వాటికి సంబంధించిన స్థానిక పోలీసు స్టేష‌న్లలో న‌మోదు అయిన కేసులు నిలువెత్తు నిద‌ర్శనంగా నిలుస్తున్నాయి. ఒక‌టి కాదు రెండు కాదు కేవ‌లం 24 గంట‌ల వ్యవధిలోనే మొత్తం 6 కేసులు రిపోర్ట్ అయ్యాయంటే.. కామంతో మృగాళ్లు ఎంత విచ్చల విడిగా తిరుగుతున్నారో.

ఒకే రోజు ఆరు సంఘటనలు….

మ‌ద‌ర్సా ఘ‌ట‌న మ‌ర‌వ‌క ముందే ఒకే రోజు ట్విన్ సిటీస్ లో మొత్తం ఆరు కేసులు న‌మోదు అయ్యాయి. కాప్రా సర్కిల్ జమ్మిగడ్డ శివసాయి నగర్ కాలనీల అభం,శుభం ఎరుగని చిన్నారిపై అఘాయిత్యానికి ఒగిగ‌ట్టాడు ఓ ప్రబుద్దుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎదిరింట్లో ఉండే 11 ఏళ్ల బాలికపై లైంగికదాడికి ప్రయ‌త్నించిన జహంగీర్ ను స్థానికులు గ‌మ‌నించారు. బాలిక‌ను న‌య‌వంచ‌కుని చెర నుంచి ర‌క్షించి మృగాడికి దేహ‌శుద్ది చేశారు. ఫోక్సో చ‌ట్టం కింది క‌ట‌క‌టాల‌వైపు నెట్టారు పోలీసులు. స‌భ్యస‌మాజం త‌ల‌దించుకునే మరో ఘటన సనత్ నగర్ లో వెలుగు చూసింది. క‌న్న కూతురిపైనే ప్రతి రోజు లైంగిక వేధింపుల‌కు పాల్పడ్డాడు ఓ నీచ్ క‌మీన్ తండ్రి. సహాక‌రించ‌ని సంద‌ర్భాల్లో కూతుర‌ని చూడ‌కుండా దండిచేవాడని త‌ల్లి బంజారాహిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేసిన పోలీసులు కామాంధుడిని రిమాండ్ చేశారు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరబండలో మ‌రో ఘ‌టన జరిగింది. 9వ తరగతి బాలిక పై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు లోకేష్ అనే నిందితుడు. .అమ్మ.నాన్న..ఇద్దరు ఉద్యోగుల్లో బిజీ గా ఉండి…పిల్లలను వేరే ఎవరికైనా అప్ప జెప్పడం తోనే ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. సనత్ నగర్ లో జరిగిన ఓ. ఘటన ..ఇంట్లో. ఒంటరిగా ఉన్న 13 సంవత్సరాల చిన్నారి పై పైశాచికంగా వ్యవహరించాడు ఓ సవతి తండ్రి.. ఒద్దు నాన్నా అన్నా. కూడా వినకుండా తన ఆనందం చుసుకున్నాడే తప్ప చిన్నారి బాధ ను పటించుకోలేదు. ఇలా వరుసగా జరుగుతున్న సంఘటనలు కలవరపరుస్తున్నాయి. చిన్న పిల్లల‌పై లైంగిక వేధింపుల‌కు పాల్పడుత‌న్న వారిపై చ‌ర్యలు తీసుకునేందుకు పోక్సో లాంటి క‌ఠిన చ‌ట్టాలు వ‌చ్చినా లైంగిక దాడులు అగ‌డం లేదు. ఇటువంటి ఘ‌ట‌న‌లు మ‌రోసారి పున‌ర‌వృతం కాకుండా ఉండాలంటే మ‌రింత క‌ఠినంగా వ్యవ‌హ‌రించేలా చ‌ర్యలు తీసుకోవాల‌నే డిమాండ్ స‌ర్వత్రా వినిపిస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*