శ‌బ‌రిమ‌ల‌పై సుప్రీం సంచ‌ల‌న తీర్పు

హరిహరసుతుడు అయ్యప్ప ఇక అందరివాడు అంటుంది సుప్రీం కోర్ట్. అయ్యప్ప స్వామి దర్శనానికి మహిళలను అనుమతించకపోవడం పై దాఖలు అయిన కేసుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తన తీర్పు ఇచ్చింది. ఆలయంలో ప్రవేశానికి మహిళలను అనుమతించాలిసిందే అని వారితో బాటు అందరు అర్హులే అని తేల్చేసింది. దాంతో దేశవ్యాప్తంగా సమాన హక్కుల కోసం ఉద్యమిస్తున్న మహిళా ఎన్జీవో లు తమ హర్షాన్ని వ్యక్తం చేశాయి. సుప్రీం తీర్పు రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులను దేశంలో నిలిచేలా చేసిందంటూ ఆనందం వెలిబుచ్చారు.

మరోసారి చర్చకు తెరలేపిన తీర్పు …

హిందూ మత ఆచార వ్యవహారాల్లో సంప్రదాయాల్లో మాత్రమే కోర్ట్ లు జ్యోక్యం చేసుకుంటున్నాయంటూ ఇప్పటికే ఈ అంశంపై సోషల్ మీడియా లో రచ్చ మొదలైంది. ఇతర మతాల్లో అనుసరిస్తున్న విధానాలపై ఎందుకు కోర్ట్ లు ఇదే తీరులో వ్యవహరించడం లేదంటూ హిందూ అతివాదులు సుప్రీం నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా మహిళా హక్కుల కోసం సుదీర్ఘ పోరాటాలు సాగిస్తున్న వారు మాత్రం ఆలయాల్లో లింగ వివక్షను తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ పోరాటం కొనసాగిస్తామని అంటున్నారు. గతంలో అయ్యప్ప ఆలయంలోనికి కొంతకాలం మహిళలను అనుమతించిన తరువాత నిలిపేసిన తీరును వారు తప్పుపట్టారు. ఇదిలా ఉండగా కేరళలోని ట్రావ‌న్ కొర్ దేవస్థానం సుప్రీం తాజా తీర్పుపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*