ట్రైన్ లో పాము కలకలం

ముంబై లోకల్ ట్రన్ లో ఓ పాము ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది. టిట్వాలా – సీఎస్ఎంటీ మధ్య నడిచే లోకల్ ట్రైన్ థానే సమీపంలోకి రాగానే ట్రైన్ లోని సీలింగ్ ఫ్యాన్ నుంచి ఓ పసిరిక పాము వేలాడుతూ కనిపించింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అప్పటికే ట్రైన్ ప్రయాణికులతో కిక్కిరిసింది. దీంతో చెయిన్ లాగి రైలును నిలిపివేశారు. దాదాపు మూడడుగులు ఉన్న ఈ పాము సిబ్బంది పట్టుకున్నారు. అయితే, అప్పటికే ఆ ట్రైన్ ఉదయం నుంచి రెండు ట్రిప్ లు తిరిగాక, మూడో ట్రిప్ లో కనిపించడం పట్ల అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా ధర్యాప్తం చేస్తామని చెబుతున్నారు. ఇప్పుడు ఈ పాము వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Sandeep
About Sandeep 6239 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*