బాబుపై సోము సెటైర్లివే….!

somu veerrajju on alliances

ఎన్టీఆర్ ను అనైతికంగా గద్దె దించి హైదరాబాద్ లో చెప్పులు వేయించిన చరిత్ర ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బీజేపీపై విమర్శలు చేసే అర్హత లేదని బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు పేర్కొన్నారు. ఆయనది 40 ఏళ్ల రాజకీయ కుటిల నీతి అని, ఎప్పడూ చక్రం తిప్పానని చంద్రబాబు చెప్పుకుంటారని, ఆయన తప్పిన చక్రం ఎప్పడూ కాంగ్రెస్ కు మద్దతుగానేని విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లడుతూ… కాంగ్రెస్ నుంచి వచ్చిన బాబు ఎన్టీఆర్ ను మభ్యపెట్టి గద్దె దించారన్నారు. చంద్రబాబుది కాంగ్రెస్ రక్తమని, ఇప్పుడు కూడా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కలలుకన్నాడన్నారు. తెలుగువారు బీజేపీని ఓడించాలని ఆయన బహిరంగంగా పిలుపునిచ్చారని కానీ తెలుగు ప్రజలు మాత్రం బీజేపీకి ఓట్లేశారన్నారు. 2008లో 40 సీట్లు 19 శాతం ఓట్లున్న బీజేపీకి ఇప్పుడు 104 సీట్లు, 35 శాతం ఓట్లు వచ్చాయన్నారు. తెలుగువాళ్లు ఉన్న పద్మనాభనగర్లో 30 వేల మెజారిటీ సాధించామని, తెలుగువారి ప్రభావం ఉన్న అనేక స్థానాలు గెలిచామని పేర్కొన్నారు. చంద్రబాబుకు మోడీని విమర్శించడమే పని అని, పరిపాలనను పూర్తిగా వదిలేశారన్నారు. కృష్ణా, గోదావరి, ఒంటిమిట్ట ప్రమాదాలే ఇందుకు ఉదాహరణ అన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు సంతాపం, పరిహారం తప్ప ఇంకేమీ చేయలేడని విమర్శించారు.

అశోక్ బాబు అధికార పార్టీ చేతీలో కీలుబొమ్మ….

ఎన్టీఓల నాయకులు ఉద్యగుల సమస్యలపై పనిచేయాలని, కానీ అశోక్ బాబు మాత్రం అధికార పార్టీ కోసం పనిచేస్తున్నారని వీర్రాజు విమర్శలు చేశారు. ఆయనను అధికార పార్టీ తయారుచేసిందని, కొన్ని మాధ్యమాలు పెంచిపోషించాయన్నారు. గతంలో విభజన సమయంలోనూ తెలంగాణ ఎన్జీఓలు ఆ రాష్ట్రానికి ఏమి కావాలో గట్టిగా అడిగారని, కానీ అశోక్ బాబు మాత్రం ఏమీ మాట్లాడలేదని పేర్కొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*