ఎన్ఐఏ కస్టడీకి శ్రీనివాసరావు..! థర్డ్ డిగ్రీ వద్దన్న కోర్టు

high court directions in jagan case

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల పాటు నిందితుడిగా ఎన్ఏఐ కస్టడీకి అందించింది. అయితే, నిందితుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని షరతు విధించింది. నిందితుడు కోరితే అతడి తరపున న్యాయవాది సమక్షంలోనే విచరణ జరపాలని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలతో రేపు శ్రీనివాసరావును ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకొని విచారించనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*