రంగస్థలం లాంటిది కావాలంట!!
రంగస్థలం డైరెక్టర్ సుకుమార్ ఎప్పటినుండో ఆర్య 3 చేయాలనీ ఉంది అని చాలా సార్లు చెప్పాడు. అయితే అల్లు అర్జున్ మాత్రం సుముఖత చూపించకపోవడంతో ఆ సినిమా మెటీరియలైజ్ అవలేదు. కానీ సుకుమార్ తో ఎటువంటి సినిమా తీయాలని అల్లు అర్జున్ ఇంకా ఏమి అనుకోలేదు. లేటెస్ట్ గా రంగస్థలం బన్నీకి నచ్చడంతో తన కోసం కూడా అటు వంటి మాంచి మాస్ ఎంటర్ టైనర్ కథ రెడీ చేయమని సుకుమార్ కి చెప్పాడంట బన్నీ.
తర్వాత సినిమాపై అంచనాలు....
ఇప్పటివరకు సుకుమార్ అటువంటి మాస్ కమర్షియల్ వైపు వెళ్ళలేదు. కానీ రంగస్థలం సినిమాతో తానూ కూడా కమర్షియల్ సినిమా తీయగలడని నిరూపించుకున్నాడు. ఇప్పటికే రంగస్థలం సినిమా హౌస్‌ఫుల్స్ కలెక్షన్స్ తో రన్ అవుతుంది. ఈ రంగస్థలం సినిమా.. సుకుమార్ తదుపరి చిత్రంపై చాలా అంచనాలు పెంచేసింది. తన నెక్స్ట్ మూవీ బన్నీతో చేసే అవకాశాలు ఎక్కువ ఉండటంతో బన్నీ కోరిన విధమైన కథకోసం సుకుమార్ ఆలోచనలు మొదలు పెట్టాడట.అటు బన్నీ కూడా నా పేరు సూర్య సినిమా తర్వాత ఎవరితో చేస్తున్నాడో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. సో సుకుమార్ స్క్రిప్ట్ రెడీ చేస్తే బన్నీ అతనితో చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ్. ఈ చిత్రం కూడా తమ సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్ లోనే ఉండే అవకాశముంది.