బ్రేకింగ్ : కాంగ్రెస్ కు బిగ్ షాక్

telangana rashtra samithi indian national congress

తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి చేరునున్నారని తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనయుడు కేటీఆర్ సురేశ్ రెడ్డి తో భేటీ అయ్యారు. అయితే సురేశ్ రెడ్డి పార్టీలో చేరితే ఎక్కడ సీటు కేటాయిస్తారన్నది చర్చనీయాంశమైంది. సురేశ్ రెడ్డి గతంలో పోటీ చేసిన బాల్కొండ, ఆర్మూర్ స్థానాలకు కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు. దీంతో సురేశ్ రెడ్డి పార్టీలో ఏ హామీతో చేరుతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

రద్దయిన రెండోరోజే….

శాసనసభ రద్దు చేసిన రెండోరోజే కీలకమైన నేత కాంగ్రెస్ ను వీడుతుండటం ఆ పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. మరోసారి కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రారంభించి విపక్షాలకు కేసీఆర్ షాకిచ్చినట్లయింది. కాంగ్రెస్ కు చెందిన ఆరుగురు ప్రముఖులు టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సురేశ్ రెడ్డి పార్టీలో చేరితే అభ్యర్థుల జాబితాను సవరిస్తారా? అన్న అనుమానం కూడా పార్టీలో వ్యక్తమవుతోంది. మిగిలిన ఆరుగురు కాంగ్రెస్ నేతలు ఎవరనేది ఆసక్తికరంగా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*