Fri Apr 26 2024 17:53:25 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : తాడేపల్లి గూడెంలో టెన్షన్...టెన్షన్...!
తాడేపల్లి గూడెంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడేపల్లి గూడెం అభివృద్ధిపై చర్చకు రావాలంటూ మాజీ మంత్రి మాణిక్యాలరావు సవాల్ కు స్పందించిన టీడీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. ఇటు బీజేపీ, అటు టీడీపీ శ్రేణులు మొహరించాయి. దీంతో వెంకట్రామన్న గూడెంలో జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజును గృహనిర్బంధం చేశారు. అలాగే బీజేపీ నేతలను కూడా ముందస్తు అరెస్ట్ లు చేశారు. తాడేపల్లి గూడెంలో పెద్దయెత్తున పోలీసులు మొహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి మాణిక్యాలరావు ఇంటివద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story