తలసాని బెజవాడ టూర్ పై వివాదం

talasani srinivas yadav in ap

టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయవాడ టూర్ పై వివాదం రేగుతోంది. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు భీమవరం వెళ్తున్న ఆయన ఇవాళ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం అక్కడ మీడియాతో.. ప్రస్తుత రాజకీయాలపై మాట్లాడటంతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. అయితే, దుర్గమ్మ సన్నిధిలో తలసాని రాజకీయాలు మాట్లాడటాన్ని ఆలయ పాలకమండలి తప్పుపడుతోంది. తలసాని వెంటనే క్షమాపణ చెప్పాలని కూడా పాలకమండలి సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ దృష్టికి తీసుకువెళ్లారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*