బెజవాడలో తలసాని హంగామా..!

talasani srinivasayadav fire on chandrababunaidu

తెలంగాణ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఆయన గత కొన్నేళ్లుగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు ఏపీలో పర్యటిస్తుంటారు. సంక్రాంతి సందర్భంగా ఇవాళ ఆయన ఆంధ్రప్రదేశ్ కి వెళ్లారు. విజయవాడలో ఆయనకు యాదవ సంఘాల నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఇబ్రహీంపట్నంలోని ఆర్కే కాలేజీలో యాదవ సామాజకవర్గం వారితో జరిగిన ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో యాదవులకు రాజకీయంగా అధిక ప్రాధాన్యత, ఎక్కువ సీట్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఏపీలో కూడా యాదవులు రాజకీయంగా ఎదగాలని అన్నారు. ఏపీలో బీసీలకు ఆదరణ లేదని, ఏపీలోనూ యాదవులతో పాటు బీసీలకు నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీలో సమావేశం నిర్వహించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. విజయవాడలో ఆయనకు ఘన స్వాగతం పలికి ర్యాలీ నిర్వహించి బలప్రదర్శన చేయాలని యాదవ సంఘాల నేతలు భావించారు. అయితే, ముందస్తు అనుమతి లేనందున పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. అయితే, కేవలం సామాజకవర్గ ఐక్యత కోసమే తలసాని ఏపీలో అడుగు పెట్టారా లేదా ఏమైన రాజకీయాలు ఉన్నాయా అని టీడీపీ అనుమానిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*