జమ్మల మడుగులో తెలుగు తమ్ముళ్లు జబ్బలు చరిచారే…!

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో వర్గపోరు మరోసారి తీవ్రమైంది. జమ్మలమడుగులో కొన్ని దశాబ్దాలుగా మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య వైరం ఉంది. అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ తరుపున గత ఎన్నికల్లో గెలిచిన ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి పదవి చేపట్టారు. దీంతో అప్పటి నుంచి ఒకే పార్టీలో ప్రత్యర్థులుగా ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి కొనసాగుతున్నారు. అయితే, వీరి వివాదాన్ని రాజీ చేయడంలో భాగంగా మూడేళ్ల తర్వాత కాంట్రాక్టులు రామసుబ్బారెడ్డి వర్గానికి ఇవ్వాలనే ఒప్పందం జరిగిందని,  మూడేళ్లు అయినా కాంట్రాక్టు పనులు తమకు ఇవ్వడం లేదంటూ రామసుబ్బారెడ్డి వర్గీయుల ఆందోళనకు దిగారు. సుజలాన్ విద్యుత్ ఉపకేంద్రం వద్ద సోమవారం ధర్నాకు దిగారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*