టీడీపీపై పవన్ మహాకుట్ర

ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ గరుడ ప్రారంభమైందని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ, వైసీపీతో పవన్ కల్యాణ్ లోపాయికారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారన్నారు. బీజేపీ చేస్తున్న వంచనలో పవన్, జగన్ పావులుగా మారుతున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష చేస్తున్నప్పుడే పవన్ కల్యాణ్ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కామెంట్స్ చేయడమేంటని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ అవగాహనతో మాట్లాడాలన్నారు. టీడీపీపై మహాకుట్ర జరుగుతుందన్నారు. ఆరోపణలు చేసేటప్పుడు ఆధారాలుండాలన్నారు. పవన్ ఎప్పుడైనా ప్రత్యేక హోదా కోసం ప్రధానిని నిలదీశారా? అని బోండా ఉమ ప్రశ్నించారు. టీడీపీని అనే అర్హత వైసీపీ, జనసేనలకు లేవన్నారు. ఎన్నికల తర్వాత వైసీపీ, జనసేన అవగాహన కుదుర్చుకుంటాయని బోండా అభిప్రాయపడ్డారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*